ఆ పిల్లాడి టాలెంట్ కి ఫిదా అయిన కేటీఆర్

Sunday, January 24th, 2021, 06:02:57 PM IST

సోషల్ మీడియా ద్వారా యువత మారుమూల దాగి ఉన్న టాలెంట్ కూడా ఇప్పుడు వైరల్ గా మారుతోంది. అయితే సోషల్ మీడియా లో ఒక వీడియో తెలంగాణ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ను ఆకర్షించింది. ఆ పిల్లాడి టాలెంట్ కి ఫిదా అయిపోయారు మంత్రి కేటీఆర్. సండే మోటివేషన్ అంటూ ఒక వ్యక్తి పోస్ట్ చేసిన వీడియో ను కేటీఆర్ చూశారు. ఒలింపిక్ మెడలిస్ట్ తయారు అవుతున్నాడు అని అన్నారు. అతను తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాడా అంటూ ఆరా తీశారు. యితే అతనికి సపోర్ట్ ఇచ్చేందుకు సిద్దం అంటూ కేటీఆర్ చెప్పుకొచ్చారు. అయితే ఆ పిల్లోడి ఎవరు ఎంటి అనేది వివరాలు ఇంకా తెలియాల్సి వుంది. అయితే ఆ పిల్లాడి స్టంట్స్ మాత్రం సూపర్ అనేలా ఉన్నాయి.