తెలంగాణలో కరోనా టెస్టులపై కేటీఆర్ కీలక ప్రకటన..!

Monday, August 10th, 2020, 07:29:27 AM IST

తెలంగాణలో రోజు రోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపధ్యంలో కరోనా పరిస్థితులపై స్పందించిన మంత్రి కేటీఆర్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కరోనా వైరస్ పరీక్షలను భారీగా పెంచనున్నట్టు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో రోజుకు సుమారు 23వేలు టెస్టులు జరుగుతున్నాయని, ఆ సంఖ్యను రోజుకు 40,000కు పెంచాలని నిర్ణయించినట్టు చెప్పారు.

ఇక రాష్ట్రంలోని 1200 కేంద్రాల్లో కరోనా టెస్టులు జరుగుతున్నాయన్నారు. తెలంగాణలో కరోనా మరణాల శాతం ఒక్క శాతం కంటే తక్కువగా ఉందని, అదే సమయంలో రికవరీ రేట్ కూడా దేశంలోనే ఎక్కువగానే ఉందని చెప్పారు. అయితే, ఇందులో చేయాల్సింది ఇంకా ఉందన్నారు. ప్రభుత్వం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికి కూడా టెస్టులు చేయడన్ లేదు, రోగులను పట్టించుకోవడం లేదు అని ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు.