బిగ్ న్యూస్: తెలంగాణ వస్తే చీకటవుతుందని దుష్ప్రచారం చేశారు…కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

Thursday, November 19th, 2020, 12:53:16 PM IST

హైదరాబాద్ లోని మీట్ ది ప్రెస్ కార్యక్రమం లో పాల్గొన్న కేటీఆర్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. దేశం మొత్తం హైదరాబాద్ వైపు చూస్తోంది అని అన్నారు. అయితే తెలంగాణ వస్తే చీకటవుతుంది అని దుష్ప్రచారం చేశారు అని, శాంతి భద్రతలకి విఘాతం కలుగుతుంది అని, కొత్త పెట్టుబడులు కాదు ఉన్న పెట్టుబడులు కూడా పోతాయి అని అప్పుడు పలువురు చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు మంత్రి కేటీఆర్. అయితే అయితే ఆ అనుమానాలు అన్ని కూడా పటా పంచలు చేస్తూ విద్యుత్ ఉత్పత్తిని సాధించాం అని మంత్రి వివరించారు. ఎక్కడా సమస్య లేకుండా నిరంతర విద్యుత్ సరఫరా మాత్రమే కాకుండా, చెత్త నుండి సంపద సృష్టించామని అన్నారు.

జీడిమెట్ల లో నిర్మాణ రంగ వ్యర్థాల కోసం ఒక ప్లాంట్ ను ఏర్పాటు చేసినట్లు వివరించారు. 600 మెట్రిక్ టన్నుల చెత్తను తరలిస్తున్న విషయాన్ని వెల్లడించారు. అంతేకాక స్వచ్ఛ సర్వేకన్ నగరాల్లో హైదరాబాద్ కి అగ్ర స్థానం దక్కింది అని అన్నారు. తెలంగాణ లో మంచి నీటి సమస్య ను సీఎం కేసీఆర్ వాయువేగంతో పరిష్కరించారు అని అన్నారు. అంతేకాక సీసీ కెమెరాల ఏర్పాటు లో హైదరాబాద్ దేశంలోనే అగ్రస్థానంలో ఉందని, ప్రపంచం లో 16 వ స్థానం లో ఉందని మంత్రి వ్యాఖ్యానించారు. పలు సమస్యల పరిష్కారం కోసం పాటు పడిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పై ప్రశంసల వర్షం కురిపించారు మంత్రి కేటీఆర్. అంతేకాక దశల వారీగా రెండు పడకల గదులను పేదలకు అందించి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని అన్నారు.