కొత్త వ్యవసాయ చట్టాలతో రైతులకు భారీ నష్టం – మంత్రి కేటీఆర్

Tuesday, December 8th, 2020, 01:22:52 PM IST

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లుల పట్ల వ్యతిరేకత వ్యక్తం చేస్తూ దేశ వ్యాప్తంగా రైతులు నిరసన కి దిగిన సంగతి తెలిసిందే. భారత్ బంద్ తో దేశ వ్యాప్తంగా రైతులు నిరసన దీక్షలు చేపట్టారు. అయితే ఈ దీక్షల్లో తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ మేరకు ఈ వ్యవసాయ చట్టాలను ఉద్దేశిస్తూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

అయితే షాద్ నగర్ బూర్గుల గేట్ వద్ద తెరాస నేతల తో కలిసి మంత్రి కేటీఆర్ ఆందోళన చేపట్టారు. అయితే కొత్త వ్యవసాయ చట్టాలతో రైతులకు భారీ నష్టం కలుగుతుంది అని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు సాగు చట్టాలను తెరాస వ్యతిరేకిస్తుంది అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఈ నూతన చట్టంలో మద్దతు ధర అంశాన్ని చేర్చక పోవడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే ఈ కొత్త చట్టాలు కార్పొరేటర్ల కి వరం గా మారి రైతుల హక్కులు హరించే ప్రమాదం ఉంది అని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించి ధరలు పెంచి అమ్ముకొనే ప్రమాదం ఉంది అని తేల్చి చెప్పారు. అంతేకాక ఈ కొత్త చట్టాలతో రైతులకు, వినియోగ దారులకు నష్టమే అని అన్నారు. అయితే తెరాస నేతలు మొదటి నుండి ఈ బిల్లుకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.