కరోనా ఇప్పట్లో పోయేలా లేదు.. కేటీఆర్ ముందస్తు హెచ్చరిక..!

Saturday, August 1st, 2020, 11:03:43 PM IST


తెలంగాణలో అంతకంతకు కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. కరోనా కట్టడికి ప్రభుత్వం ఎన్ని రకాల చర్యలు తీసుకుంటున్నా కేసుల సంఖ్యలో తగ్గుదల కనిపించడం లేదు. దీంతో కరోనా బారిన పడకుండా ఎవరికి వారే జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం ఎప్పటికప్పుడు చెబుతూనే ఉంది.

అయితే తాజాగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ కరోనా ఇప్పట్లో పోయేలా లేదని, ప్రజాప్రతినిధులు, అధికారులు అప్రమత్తంగా ఉంటూ ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని అన్నారు. ఎక్కడా కూడా ప్రజలు ఇబ్బందులు పడకూడదని, స్మా దాతలపై కూడ ఫోకస్ పెట్టాలని అన్నారు. విపక్షాలు చేస్తున్న ఆరోపణలను సమర్ధంగా తిప్పుకొట్టండని అన్నారు.