ఈ సారి సెంచరీ కొట్టాలి.. నేతలకు కేటీఆర్ దిశానిర్దేశం..!

Friday, November 20th, 2020, 09:37:54 PM IST


గ్రేటర్ ఎన్నికలలో టీఆర్ఎస్ తరపున టికెట్లు దక్కించుకున్న నేతలతో తెలంగాణ భవన్‌లో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అభ్యర్థులకు ఎన్నికలపై దిశానిర్దేశం చేశారు. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సెంచరీ మిస్ అయిందని, కానీ ఈ సారి ఎన్నికలలో మాత్రం సెంచరీ కొట్టాలని అన్నారు. హైదరాబాద్ బాగుంటేనే తెలంగాణ బాగుంటుందని, హైదరాబాద్‌ను కంటికి రెప్పలా కాపాడుకునే బాధ్యత మన అందరిపై ఉందని అన్నారు.

హైదరాబాద్‌లో టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభిృద్ధిపై ప్రగతి నివేదికను రిలీజ్ చేసిన కేటీఆర్, ఆరేళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందో ఇందులో క్లియర్‌గా ఉందని అది ప్రజలకు వివరించే బాధ్యత కూడా మీదే అని అభ్యర్థులకు సూచించారు. అంతేకాకుండా పార్టీలోని అసంతృప్తి, రెబల్‌గా పోటీ చేస్తున్న అభ్యర్థుల ఇళ్లకు వెళ్ళి వారిని బుజ్జగించాలని కూడా చెప్పుకొచ్చారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మహిళలకు 75 సీట్లు ఇవ్వాల్సివుండగా 85 సీట్లు ఇచ్చామన్నారు. 17 సీట్లు మైనారిటీలకు, ఎస్టీలకు 3, ఎస్సీ లకు 13 సీట్లు కేటాయించామన్నారు. సామాజికన్యాయాన్ని టీఆర్ఎస్ పార్టీ చేతల్లో చూపించిందని కేటీఆర్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.