బుడతడి బాంగ్రా స్టెప్పులకు మంత్రి కేటీఆర్ ఫిదా..!

Monday, October 5th, 2020, 02:20:04 PM IST

ఓ పంజాబీ బాలుడి బాంగ్రా స్టెప్పులకు దేశ వ్యాప్తంగా ఫ్యాన్స్ పెరిగిపోతున్నారు. ఓ ఇంటి గేటు లోపల ఉన్న రెండు కుక్క పిల్లలతో గేటు బయట ఉన్న ఆ బాలుడు మీరు నన్ను ఏం చేయలేరు అన్నట్టుగా ఆడుకుంటూ డ్యాన్స్ చేస్తున్నప్పుడు గేటు లోపలున్న వారు వీడియో తీశారు. అయితే ఆ పిల్లాడు చేసిన బాంగ్రా స్టెప్పులకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

చాలా అద్భుతంగా డ్యాన్స్ చేశావంటూ ఆ కుర్రాడిపై ప్రతి ఒక్కరు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అయితే తాజాగా ఆ పిల్లాడి డ్యాన్స్ వీడియోను రీ ట్వీట్ చేసిన తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ చాలా అద్భుతంగా చేశావని, నిజంగా నీ డ్యాన్సింగ్ స్కిల్ సూపర్, చంపేశావ్ అంటూ ట్వీట్ చేశాడు.