ఇకపై అమెజాన్ లో తెలంగాణ హస్తకళలు!

Thursday, February 5th, 2015, 09:02:18 AM IST


తెలంగాణ ఐటి మరియు పంచాయితీరాజ్ శాఖామంత్రి కేటిఅర్ బుధవారం సచివాలయంలో అమెజాన్ సంస్థ ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ హస్త కళలను ఆన్ లైన్ లో అందుబాటులోకి తెచ్చేందుకు అమెజాన్.కామ్ సుముఖతను వ్యక్తం చేసింది. అలాగే ఈ ఉత్పత్తులను ఆన్ లైన్ లో విక్రయించడం ద్వారా తెలంగాణ పారిశ్రామిక వృద్ధికి తమవంతు సహాయ సహకారాలను అందిస్తామని అమెజాన్ సంస్థ పేర్కొంది.

ఇక సమావేశం అనంతరం అమెజాన్ రియల్ ఎస్టేట్స్ అధిపతి జాన్ షాట్లేర్ విలేకరుల సమావేశంలో ప్రసంగిస్తూ రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాల మహిళలు తయారు చేసే ఉత్పత్తులు, నిర్మల్ బొమ్మలు, పోచంపల్లి చీరలు, బిద్రీ ఉత్పత్తులను త్వరలో ఆన్ లైన్ ద్వారా విక్రయించనున్నామని స్పష్టం చేశారు.