తెలంగాణలో అమెజాన్ భారీ పెట్టుబడులు…కేటీఆర్ కీలక ప్రకటన!

Friday, November 6th, 2020, 01:13:31 PM IST

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నా పలు కీలక నిర్ణయాల వలన పెట్టుబడులు పెరుగుతున్నాయి. అయితే మల్టీ నేషనల్ కంపనీ అయిన అమెజాన్ మరొకసారి తెలంగాణ లో భారీ పెట్టుబడులు పెడుతున్నట్లు పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియా ద్వారా కీలక ప్రకటన చేశారు. అమెజాన్ వెబ్ సర్వీసెస్ సంస్థ తెలంగాణ లో భారీ పెట్టుబడులు పెట్టడం శుభ పరణామమని చెప్పాలి. తెలంగాణ రాష్ట్రం చరిత్రలోనే విదేశీ పెట్టుబడులు భారీగా వచ్చాయి అని ఈ మేరకు మంత్రి వెల్లడించారు.

అయితే ఏ దబ్ల్యూ ఎస్ సంస్థ తెలంగాణ లో 20,761 కోట్ల రూపాయలను ప్రత్యక్ష పెట్టుబడులు పెడుతున్నట్లు మంత్రి వ్యాఖ్యానించారు. అయితే ఈ సంస్థ రాష్ట్రం లో పలు డేటా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే త్వరలోనే ఈ సంస్థ హైదరాబాద్ కేంద్రం గా తమ కార్యకలాపాలను ప్రారంభించే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఇప్పటికే స్టార్ట్ అప్ ల ద్వారా నిరుద్యోగులను, ప్రతిభా ఉన్న వారిని ఆదుకునేందుకు సిద్దంగా ఉన్న తెలంగాణ సర్కార్ ఈ నిర్ణయం తో త్వరలో యువత సైతం లబ్ది పొందే అవకాశం కనిపిస్తోంది.