రూ.600 కోట్లతో కమాండ్ కంట్రోల్ రూమ్… హైదరాబాద్ మరింత సురక్షితం

Tuesday, November 17th, 2020, 01:54:28 PM IST

హైదరాబాద్ నగరం మరింత సురక్షితం కానుంది. మరో రెండు మూడు నెలల్లో హైదరాబాద్ లోని కమాండ్ కంట్రోల్ రూమ్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం లో శాంతి భద్రతల పరిరక్షణ కోసం అత్యాధునిక సాంకేతిక తో నిర్మిస్తున్న పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను పువ్వాడ అజయ్ కుమార్ మరియు మహమూద్ అలీ లతో కలిసి కేటీఆర్ పరిశీలించారు. అయితే ఈ నేపథ్యం లో మంత్రి కేటీఆర్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

భారత దేశం లో ఎక్కడా లేని విధంగా చాలా అద్భుతంగా కమాండ్ కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి వ్యాఖ్యానించారు. అయితే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం తో 19 అంతస్తుల్లో ఈ కమాండ్ కంట్రోల్ రూమ్ ను నిర్మిస్తున్నట్లు తెలిపారు. అయితే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మొదటి నుండి పోలీస్ విభాగం అభివృద్ధికి కృషి చేస్తున్నారు అని మంత్రి కొనియాడారు. అయితే ఈ పోలీస్ కంట్రోల్ కమాండ్ ను 600 కోట్ల రూపాయల తో ఏర్పాటు చేసినట్లు వివరించారు. దీని ద్వారా సీఎం తో పాటు రాష్ట్ర యంత్రాంగం ఓకే చోట పరిస్తితులను సమీక్షించే అవకాశం ఉందని మంత్రి పేర్కొన్నారు. ఈ సెంటర్ ద్వారా హైదరాబాద్ నగరం మరింత సురక్షితం కానుంది అని మంత్రి వ్యాఖ్యానించారు. అయితే సందర్శకుల కోసం ఇందులో ఒక గ్యాలరీ ఏర్పాటు చేసినట్లు మంత్రి వ్యాఖ్యానించారు.