దుబ్బాక ఉపఎన్నిక ఫలితం అనంతరం మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

Tuesday, November 10th, 2020, 04:32:48 PM IST

దుబ్బాక ఉపఎన్నిక ఫలితం తో తెరాస శ్రేణులు ఒక్కసారిగా మూగబోయాయి. ఒక పక్క బీజేపీ గెలుపుతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ ఉపఎన్నిక ఫలితం అనంతరం పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

విజయాలకు గర్వపడం, అపజయాలకి కుంగిపొం అని అన్నారు. అయితే ఈ ఎన్నికలో తెరాస కి ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ కూడా ధన్యవాదాలు తెలిపారు. అంతేకాక ఈ ఎన్నిక గెలుపు కోసం అహర్నిశలు శ్రమించిన నాయకులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేశారు మంత్రి కేటీఆర్. అయితే ఈ ఎన్నికలో ఓటమికి గల కారణాలను విశ్లేషించుకొని భవిష్యత్ లో ముందుకు వెళ్తాం అని తెలంగాణ భవన్ నుండి మంత్రి కేటీఆర్ తెలిపారు. అయితే తెరాస బీజేపీ పోటాపోటీ గా ఒకరు పై మరొకరు సవాళ్లు సైతం ప్రచారం సమయం లో విసిరారు. అంతిమంగా బీజేపీ కి ప్రజలు మద్దతు తెలిపారు.