హాట్ టాపిక్: ఆచార్య లో చరణ్ పాత్రపై కొరటాల శివ కీలక వ్యాఖ్యలు

Wednesday, December 16th, 2020, 01:37:52 PM IST

మెగా అభిమానులు అంతా కూడా ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న చిత్రం ఆచార్య. ఈ చిత్రం లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తుండగా, చరణ్ కు ఈ సినిమా లో ఒక పాత్ర పోషిస్తున్నారు. అయితే రామ్ చరణ్ పాత్ర పై ఇప్పటికే పలు వార్తలు వచ్చాయి. అయితే ఈ చిత్రం గురించి, రామ్ చరణ్ పాత్ర గురించి దర్శకుడు కొరటాల శివ కీలక వ్యాఖ్యలు చేశారు. లాక్ డౌన్ తర్వాత షూటింగ్ చేయడం సంతోషంగా ఉందని, కరోనా నిబంధనలను పాటిస్తూ షూటింగ్ చేస్తున్నాం అని తెలిపారు. అయితే మెగాస్టార్ చిరంజీవి సినిమాలు చూస్తూ పెరిగాను అని, ఇప్పుడు ఆయన తో సినిమా చేస్తుంటే తన కల సాకారం అయినట్లు వివరించారు.

సినిమా ప్రారంభం అయినప్పుడు ఎంత ఉత్సాహంగా ఉన్నారో, ఇప్పుడు కూడా అలానే ఉన్నారు అని తెలిపారు. ప్రతి షాట్, సీన్ లో చాలా కచ్చితంగా ఉంటారు అని, ఆయనకి అధ్బుతమైన జ్ఞాపక శక్తి ఉందని, పని పట్ల అంకిత భావం, ఉత్సుకత కనబరిచే వ్యక్తి తో పని చేయడం చాలా తేలిక అని, ఫలితం కూడా మంచిగానే ఉంటుంది అని తెలిపారు. అయితే రామ్ చరణ్ పాత్ర మెగా అభిమానులకి ట్రీట్ కానుంది అని అన్నారు. చరణ్ పూర్తి స్థాయి పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నారు అని అన్నారు. అయితే తండ్రి కొడుకులు ఇద్దరితో కలిసి పని చేయడం అదృష్టం అని అన్నారు. ఈ అవకాశాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకొని ప్రేక్షకుల్ని అలరిస్తానని ఆశిస్తున్నా అని అన్నారు. అంతేకాక వారిద్దరినీ ఓకే ఫ్రేమ్ లో చూసేందుకు ఆతృత గా ఎదురు చూస్తున్నా అని తెలిపారు.