మహేష్ సినిమా.. కొరటాలకు జాక్ పాట్ ?

Monday, October 10th, 2016, 09:55:11 PM IST

mahesh-koratala-siva
‘మిర్చి’ , ‘శ్రీమంతుడు’ , ‘జనతా గ్యారేజ్’ చేసిన మూడు సినిమాలు సంచలన విజయాలు అందుకున్నాయి. ఈ ముగ్గురి హీరోలకు కెరీర్ బెస్ట్ సినిమాలు అందించిన దర్శకుడిగా ఇమేజ్ తెచ్చుకున్నాడు దర్శకుడు కొరటాల శివ. ”జనతా గ్యారేజ్” సినిమా తరువాత అయన రూపొందించే సినిమా మహేష్ బాబుతో ఉంటుందని చెప్పాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబందించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది. వచ్చే నెలలో ఈ సినిమా మొదలు కానుంది. ఇక ”శ్రీమంతుడు” సినిమా తరువాత మళ్ళీ మహేష్ తో సినిమా చేసే ఛాన్స్ కొట్టేసిన కొరటాల శివ కు నిజంగా ఈ సినిమా జాక్ పాట్ అని చెప్పాలి. ఎందుకో తెలుసా ..ఈ సినిమాకు సంబందించిన ఓవర్ సీస్ హక్కులను కొరటాల రెమ్యూనరేషన్ కింద తీసుకుంటున్నాడు. అసలే మహేష్ సినిమాకు ఓవర్ సీస్ లో సూపర్ క్రేజ్ కాబట్టి .. ఈ సినిమా అక్కడ పదిహేను- ఇరవై కోట్ల వరకు వసూలు చేసే ఛాన్స్ ఉంది, సో రెమ్యూనరేషన్ కింద ఇంత మొత్తం వచ్చే ఛాన్స్ దక్కినట్టే. ఈ లెక్కన రెమ్యూనరేషన్ విషయంలో టాలీవుడ్ లో రాజమౌళి తరువాత ఆ స్థాయి రెమ్యూనరేషన్ తో కొరటాల టాప్ లిస్ట్ లోకి చేరినట్టే?