టీఆర్ఎస్‌పై సెటైర్లు వేసిన మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి..!

Thursday, September 17th, 2020, 07:30:42 AM IST

హైదరాబాద్‌లోని నిన్న అనేక ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. కుండపోతతో నగర వీధులన్ని జలమయమయ్యాయి. రహదారులపై భారీగా నీరుచేరడంతో పలు చోట్ల ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదురుకున్నారు. భారీ వర్షంతో పలు చోట్ల ప్రాణ నష్టం కూడా జరిగింది.

అయితే హైదరాబాద్‌లో నిన్న కురిసిన భారీ వర్షాలు, డ్రైనేజీ తీరుపై కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి విమర్శలు గుప్పించారు. టీఆర్ఎస్ భవన్ సహా అనేక చోట్ల డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేదని మండిపడ్డారు. ఇప్పుడు ఈ సమస్యకు పరిష్కారం ఏంటని కేటీఆర్ తండ్రి కేసీఆర్‌ని అడగగా జీహెచ్ఎంసీ ఎన్నికలను వాయిదా వేద్దాం అని చెప్పారంటూ సెటైర్లు వేశారు. దేశంలోనే నంబర్ వన్ సిటీ హైదారాబాద్‌లో సమస్యలు తాండవం చేస్తున్నాయని అన్నారు.