అది పుకారు మాత్రమే.. పార్టీ మార్పుపై కొండా విశ్వేశ్వరరెడ్డి క్లారిటీ..!

Saturday, November 21st, 2020, 03:00:50 AM IST


కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డిని బీజేపీ జాతీయ ప్రధాని కార్యదర్శి భూపేందర్‌ యాదవ్ తాజాగా కలిశారు. అయితే కొండా విశ్వేశ్వర్‌రెడ్డిని భూపేందర్ యాదవ్ బీజేపీలోకి ఆహ్వానించారని, ఆయన విజ్ఞప్తిపై విశ్వేశ్వర్ రెడ్డి కూడా సానుకూలంగా స్పందించినట్లు ప్రచారం జరుగుతుంది. అయితే తాజాగా దీనిపై ట్విట్టర్ ద్వారా స్పందించిన కొండా విశ్వేశ్వరరెడ్డి క్లారిటీ ఇచ్చారు. అయితే ఈ ప్రచారన్ని కొండా విశ్వేశ్వరరెడ్డి పూర్తిగా కొట్టిపారేశారు. అది కేవలం పుకారు మాత్రమేనని, తనకు అన్ని పార్టీలలో స్నేహితులు ఉన్నారని చెప్పారు. టీఆర్ఎస్, ఎమ్ఐఎమ్, బీజేపీలో కూడా పరిచయస్తులు ఉన్నారని తెలిపారు.