తెరాస ముఖ్యనేతలతో కొండా దంపతుల భేటీ !

Monday, March 17th, 2014, 06:33:58 PM IST

వరంగల్ జిల్లాలోని ముఖ్యనేతలతో కొండా దంపతులు సోమవారం భేటీ అయినట్లు సమాచారం. వరంగల్ లోని తూర్పు ప్రాంతం లోని నియోజక వర్గం నుంచి కొండా సురేఖకు ఎమ్మెల్యే టికెట్, కొండా మురళికి ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చే విధంగా వారి మధ్య ఒప్పందం జరిగినట్లు తెలుస్తోంది. కాగా కొండా దంపతులు ఇటీవలే వైకాపా లో తమకు సముచిత స్దానం కల్పించడం లేదంటూ తిరిగి కాంగ్రెస్ లో చేరిన సంగతి తెలిసిందే.