దుబ్బాకకు బలగాలను పంపండి.. సీఈసీకి ఎంపీ కోమటిరెడ్డి లేఖ..!

Friday, October 30th, 2020, 01:09:42 AM IST


తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి కేంద్ర ఎన్నికల కమీషనర్‌కు లేఖ రాశారు. దుబ్బాకలో పరిస్థితులు పూర్తిగా మారిపోతున్నాయని అందుకే కేంద్రం నుంచి బలగాలను పంపాలని కోరారు. ఉప ఎన్నికలను స్వేచ్ఛగా పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. టీఆర్ఎస్, బీజేపీలు అక్రమ మార్గంలో గెలిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయని అన్నారు.

అయితే బీజేపీ అభ్యర్థి బంధువు ఇంట్లో డబ్బులు దొరికాయని అవి మావి కాదంటే మావికాదని దొంగసాకులు చెబుతున్నారని అన్నారు. మంత్రి హరీశ్‌రావు తన అధికారాన్ని ఉపయోగించి ప్రత్యర్థి పార్టీ నాయకులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని అన్నారు. ఎన్నికల నిబంధనలు అతిక్రమించి అక్రమాలకు పాల్పడుతున్న వారిపై మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దుబ్బాకలో ప్రతి మండలానికి కనీసం ఒక కేంద్ర పరిశీలకుడిని పంపాలని డిమాండ్ చేశారు.