రాష్ట్రం చావుల తెలంగాణగా మారింది.. సీఎం కేసీఆర్‌కు కోమటి రెడ్డి లేఖ..!

Saturday, November 14th, 2020, 02:07:11 AM IST


తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కాంగ్రెస్ ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. మీ పాల‌న‌లో రాష్ట్రం చావుల తెలంగాణగా మారిందని అన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక గ్రామాల అభివృద్ధిని గాలికొదిలేశారని, ఆరేళ్ల పాలనలో గ్రామాల్లో ఆత్మహత్యలు తప్ప అభివృద్ధి ఏమీ లేదని, ఏకగ్రీవ గ్రామపంచాయతీలకు ఇప్పటికీ నిధులు ఇవ్వలేదని ఆరోపించారు.

అయితే ఎన్నికల ముందు టీఆర్ఎస్ ఎన్నో చెబుతుందని, చివరకు అవన్ని మాయమటలే అని తేలిపోయాయని అన్నారు. అప్పు చేసి మరీ గ్రామాన్ని అభివృద్ధి చేసిన రంగారెడ్డి జిల్లా కాశగూడెం సర్పంచ్‌ ఆత్మహత్య చేసుకున్నాడని అన్నారు. అయితే సర్పంచ్‌ ఆత్మహత్యకు మీరు, మీ రాష్ట్ర‌ ప్ర‌భుత్వ‌మే పూర్తి బాధ్య‌త వహించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్ల‌క్ష్యంతో మృతి చెందిన అజారుద్దీన్ కుటుంబాన్ని ప్ర‌భుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని, ఏక‌గ్రీవంగా ఎన్నికైన గ్రామాల‌కు వెంట‌నే నిధులు విడుద‌ల చేయాలని లేఖ ద్వారా డిమాండ్ చేశారు.