ధోనీ, రోహిత్ లను వెనక్కి నెట్టిన కోహ్లీ

Monday, December 14th, 2020, 05:44:50 PM IST

టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మాజీ కెప్టెన్, క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ మరియు రోహిత్ శర్మ లను వెనక్కి నెట్టాడు. అయితే ఈ రికార్డ్ బీట్ చేసింది క్రికెట్ లో కాదు, సోషల్ మీడియా లో. సోషల్ మీడియా వేదిక గా ట్విట్టర్ లో ఈ ఏడాది ఎక్కువగా చర్చించుకున్న ఇండియన్ అథ్లెట్ లలో కోహ్లీ టాప్ ప్లేస్ లో నిలిచారు. అయితే ఈ విషయం లో కోహ్లీ, ధోనీ మరియు రోహిత్ లను అధిగమించాడు. ఇప్పటికే కెప్టెన్ కోహ్లీ తను తండ్రి కాబోతున్నట్లు చేసిన ట్వీట్ ఈ సంవత్సరం ఎక్కువ లైక్స్ సాధించిన ట్వీట్ గా నిలిచిన సంగతి తెలిసిందే.