ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ ల పై కోహ్లీ కీలక వ్యాఖ్యలు!

Monday, March 29th, 2021, 12:20:53 PM IST

మూడు వన్డేల సిరీస్ ను టీమ్ ఇండియా కైవసం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. ఆఖరి వన్డే లో టీమ్ ఇండియా ఏడు పరుగుల తేడా తో ఇంగ్లాండ్ పై విజయం సాధించి 2-1 తో సీరీస్ సొంతం చేసుకుంది. అయితే ఆఖరి వరకూ కూడా మూడవ వన్డే మ్యాచ్ ఆసక్తికరం గా సాగింది. నువ్వా నేనా అన్న తరహాలో ఇంగ్లాండ్ గట్టి పోటీ ఇచ్చింది. అయితే ఇంగ్లాండ్ ఒడినప్పటికి సామ్ కరణ్ ఆట మాత్రం అందరినీ ఆకట్టుకుంది. భారతీయులు సైతం అతని పై ప్రశంసల వర్షం కురిపించారు. అయితే అతను ఆడిన ఇన్నింగ్స్ కి గానూ ప్లేయర్ అఫ్ ది మ్యాచ్ కి ఎంపిక అయ్యాడు. అయితే అదే తరహ లో సిరీస్ మొత్తం మీద 219 పరుగులు చేసిన జాని బెయిర్ స్టో ను మ్యాన్ ఆఫ్ ది సిరీస్ కి ఎంపిక చేయడం జరిగింది.

అయితే ఈ నిర్ణయం పట్ల కెప్టెన్ విరాట్ కోహ్లీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా శార్దూల్ ఠాకూర్ ను ఎంపిక చేస్తారని అనుకున్నా అంటూ చెప్పుకొచ్చారు. అయితే సామ్ కరణ్ ఎంపిక ఒకింత విస్మయానికి గురి చేసింది అని చెప్పుకొచ్చారు. మిడిల్ ఓవర్స్ లో వికెట్లు తీయడం అనేది చాలా కష్టం తో కూడుకున్న పని అని అన్నారు. అయితే ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ కి భువనేశ్వర్ అర్హుడు అంటూ చెప్పుకొచ్చారు. భువనేశ్వర్ మూడు మ్యాచు లలో కలిపి 22.50 సగటు తో, 4.65 ఎకానమీ తో ఆరు వికెట్లు పడగొట్టిన సంగతి తెలిసిందే.