త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో కోదండరాం

Saturday, September 19th, 2020, 11:01:20 AM IST

తెలంగాణ రాష్ట్రం లో త్వరలో పట్టభద్రుల కోట ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఇందులో తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం పోటీ చేయనున్నారు. అయితే ఇప్పుడు ఈ విషయం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారుతోంది.తెలంగాణ రాష్ట్రం ఉద్యమం కోసం కోదండరాం క్రియాశీలక పాత్ర పోషించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే కోదండరాం కి వరంగల్, ఖమ్మం, నల్గొండ నియోజకవర్గ అభ్యర్ధిగా మద్దతు ఇవ్వాలి అంటూ తెలంగాణ జన సమితి ప్రతి పక్ష పార్టీ నేతలను కోరడం జరిగింది.

అయితే ఈ మేరకు కాంగ్రెస్, తెలుగు దేశం పార్టీ, సీపీఐ, సీపీఎం మరియు న్యూ డెమోక్రసీ పార్టీలకు తెలంగాణ జన సమితి లేఖలు రాయడం జరిగింది. అయితే కోదండరాం గెలుపు అవసరం అని, నిరుద్యోగులు, యువత ఆశిస్తున్నారు అని, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్తితుల్లో మండలి లో గొంతెత్తే నాయకుడిని గెలిపించాలని తెలంగాణ జన సమితి పొలిటికల్ అఫైర్స్ కమిటీ బాధ్యులు కోరడం జరిగింది. అయితే ఈ ఎన్నికల్లో జరిగే రెండు స్థానాలకు ప్రతి పక్ష పార్టీ నేతలు మాత్రమే కాకుండా, అధికార పార్టీ కూడా ఎంతో ప్రతష్టాత్మకంగా భావిస్తున్న సంగతి తెలిసిందే.