ఓడిపోయినా నైతిక విజయం మాదే – కోదండరామ్

Sunday, March 21st, 2021, 09:40:09 PM IST

తెలంగాణ రాష్ట్రం లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసిన ప్రొఫెసర్లు ఓటమి చవి చూసిన సంగతి తెలిసిందే. అయితే అందులో కోదండరామ్ కూడా ఉన్నారు. అయితే తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికలో ఓటమి పై కోదండరామ్ స్పందించారు. రైతు, గిరిజన, ఉపాధ్యాయ, ఉద్యోగ ప్రజా సంఘాలు తనకు బాగా మద్దతు తెలిపారు అని వ్యాఖ్యానించారు. అయితే నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో ఎవరికి మద్దతు ఇవ్వదలచు కోలేదు అని, ఎన్నికల్లో ఓడిపోయినా నైతిక విజయం మాదే అని వ్యాఖ్యానించారు. అయితే పదవి కాంక్ష తో పోటీ చేయలేదు అని, ఉద్యోగుల పీఆర్సీ, బదిలీ లు, ప్రమోషన్ల పై తీవ్రంగా ఒత్తిడి చేశామని చెప్పారు. అయితే కాంట్రాక్ట్ మరియు ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల విషయం లో సుప్రీం తీర్పు అనుసరించి పనికి సమాన వేతనం ఇవ్వాలని పొరడాం అని వ్యాఖ్యానించారు. అయితే అధికార పార్టీ పాలన మారకుండా ఇది సాధ్యం కాదు అని ప్రచారం చేసిన విషయాన్ని వెల్లడించారు. అయితే 50 వేల ఉద్యోగాల భర్తీ అనే ప్రకటన తాము చేసిన ప్రచారం వలనే సాధ్యం అయింది అంటూ వ్యాఖ్యానించారు.

అయితే మూడు రోజుల ముందు పార్టీ ప్రచారం కొరకు, యాడ్స్ కి ఎంత ఖర్చు చేసింది అనేది అందరికీ తెలుసు అని కోదండరామ్ అన్నారు. అయితే మేధావులు, చదువుకున్న వారు మౌనం వహించడం చాలా ప్రమాదకరం అంటూ చెప్పుకొచ్చారు. అధికార పార్టీ డబ్బులు పంచింది అని ఆరోపించారు. రేపు సాగర్ లో కూడా వెయ్యి కాకపోతే రెండు వేలు పంచుతారు అని, గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో పోలింగ్ కేంద్రాల వద్ద డబ్బులు పంచితే ఎన్నికల కమిషన్ ఏం చేసింది అంటూ సూటిగా ప్రశ్నించారు. అయితే కోదండరామ్ చేసిన వ్యాఖ్యలు సర్వత్రా హాట్ టాపిక్ గా మారాయి.