ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలి

Sunday, January 3rd, 2021, 09:00:02 PM IST

తెలంగాణ రాష్ట్రం లోని నిరుద్యోగులు, రైతులు, ప్రైవేట్ ఉపాద్యాయుల సమస్యలు పరిష్కరించడం కోసం తలపెట్టిన నిరాహార దీక్షకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడం శోచనీయం అంటూ తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం అన్నారు.రాష్ట్రంలోని ప్రజా సమస్యలు పరిష్కరించేవరకు తెలంగాణ జన సమితి అధ్వర్యంలో పోరాటాలు చేస్తామని తెలిపారు. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి ఆరేళ్లు అయినా ఇంకా నిరుద్యోగ భృతి ఇవ్వకపోవడం దారుణం అని కోదండరాం అన్నారు.

అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ భృతి కూడా ఇవ్వకపోవడం కారణం గా నిరుద్యోగులు అనేక ఇబ్బందులు పడుతున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వ్యవసాయం కూడా సంక్షోభం లో కూరుకుపోయింది అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమయంలో అన్న దాతలను కాపాడాల్సిన అవసరం ఉందని, ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా పోరాటం ఆపేది లేదు అని తేల్చి చెప్పారు. అయితే ముందుగానే అనుకున్న విధంగా 48 గంటల పాటు దీక్షను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. అయితే పార్టీ కార్యాలయంలో దీక్షకు కూర్చున్న కోదండరాం కి, సీపీఐ, సీపీఎం, తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ, చుక్కా రామయ్య పలువురు ప్రముఖులు సంఘీభావం తెలిపారు.

అయితే ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, కేసీఆర్ పాలనలో రాష్ట్రం అప్పుల ఊబి లో కూరుకు పోయింది అని,సాధారణ ప్రజల జీవన ప్రమాణాల్లో మార్పులను తీసుకు రాలేక పోయింది అంటూ ఎల్.రమణ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ నిరహరణ దీక్ష పట్ల ప్రభుత్వం సైతం కాస్త ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.