ఎల్ఆర్ఎస్‌ను వెంటనే రద్దు చేయాలి.. కోదండరాం డిమాండ్..!

Thursday, December 24th, 2020, 11:10:19 AM IST

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎల్ఆర్ఎస్‌ను వెంటనే రద్దు చేయాలని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం కోరారు. ఖమ్మం జిల్లా వైరాలో మీడియాతో మాట్లాడిన కోదండరాం ఎల్ఆర్ఎస్‌తో ప్రజలను టీఆర్ఎస్ ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపించారు. అన్ని ప్లాట్లకు పాత పద్ధతుల్లోనే రిజిస్ట్రేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు.

అయితే అధికారులు ప్రభుత్వ ఉద్యగాల భర్తీకి తప్పుడు లెక్కలను ఇవ్వడం సరికాదని, ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలన్నిటిని భర్తీ చేయాలని సూచించారు. ఇదే కాకుండా నిరుద్యోగులకు అందించే నిరుద్యోగ భృతి కూడా వెంటనే కల్పించాలని కోరారు. ప్రభుత్వ నిరంకుశ విధానాలతో ప్రజలు విసిగిపోతున్నారని, ఇకనైనా ప్రభుత్వం మొండి వైఖరిని వీడాలని, లేదంటే ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడతామని హెచ్చరించారు.