ఎమ్మెల్సీ బరిలో తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం..!

Tuesday, August 25th, 2020, 07:29:25 AM IST

తెలంగాణ జనసమితి అద్యక్షుడు కోదండరాం ఎమ్మెల్సీ బరిలో నిలవనున్నారు. ప్రత్యేక తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోశించిన కోదండరాంను కేసీఆర్ సీఎం అయ్యాక పూర్తిగా పక్కనపెట్టేశారు. అంతేకాదు కొన్ని సందర్భాలలో ఆయనపై పోలీస్ కేసులు కూడా నమోదు చేయించారు. అయితే ఆ తరువాత తెలంగాణ జనసమితి పేరుతో సొంతంగా పార్టీనీ స్థాపించి 2018 ఎన్నికలలో కాంగ్రెస్ కూటమితో కలిశారు.

అయితే వచ్చే ఏడాది పట్టుభద్రుల కోటాలో జరిగే 2 ఎమ్మెల్సీ స్థానాలకు పోటీ చేయాలని తెలంగాణ జనసమితి నిర్ణయించింది. వరంగల్, ఖమ్మం, నల్లగొండ స్థానం నుంచి కోదండరాం బరిలో నిలుస్తారని ఈ మేరకు తదుపరి సమావేశంలో నిర్ణయం జరగడం సూత్రపాయమేనని పలువురు TJS నేతలు అభిప్రాయపడ్డారు. అటు రెండో స్థానానికి పోటీ చేసే అభ్యర్థికి సంబంధించి ఇతర పార్టీలు, ప్రజా సంఘాల నేతల అభిప్రాయాలు, మద్ధతు సేకరించాలని TJS నిర్ణయించింది.