ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ జరుగుతుందని నమ్మకం లేదు – కోదండరాం

Tuesday, December 15th, 2020, 03:32:56 PM IST

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పై తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగాల పేరుతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నాటకాలు ఆడుతోంది అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ లో ప్రస్తుతం 34 శాతం మంది నిరుద్యోగులు ఉన్నారు అని తెలిపారు. అయితే ఇటీవల సీఎం కేసీఆర్ రాష్ట్రం లో ఖాళీ గా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ జరుగుతుందని నమ్మకం తమకు లేదు అని కోదండరాం సంచలన వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఖాళీ పోస్టుల సమాచారం ఉన్నప్పటికీ కమిటీల పేరుతో కాలయాపన చేస్తోంది అంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఇటీవల ఢిల్లీ వెళ్లిన సీఎం కేసీఆర్ జోనల్ వ్యవస్థ మీద స్పష్టత తీసుకు రాలేదు అని ఘాటు విమర్శలు చేశారు. అయితే పాత జోనల్ ప్రకారం ఖాళీలు భర్తీ చేస్తే సమస్యలు తలెత్తుత్తాయి అని తెలిపారు. అంతేకాక సీఎం కేసీఆర్ తీరును ఎండగడుతూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.