తెలంగాణ సర్కార్ పై కోదండరాం సీరియస్ కామెంట్స్

Thursday, November 5th, 2020, 01:21:54 PM IST

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పై తెలంగాణ జనసమితీ అధ్యక్షుడు కోదండరాం పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ పూర్తిగా ఆర్ధిక సంక్షోభం లో కూరుకుపోయింది అని తెలిపారు. ఎల్ ఆర్ ఎస్ పేరుతో సర్కార్ రియల్ ఎస్టేట్ రంగం నడ్డి విరిచింది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం లో రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా స్తంభించి పోయింది అని, ఎల్ ఆర్ ఎస్ ను రద్దు చేసి రియల్ ఎస్టేట్ రంగం ను పునరుద్ధరించాలని కోదండరాం అన్నారు. అయితే రాష్ట్రంలో ప్రతి ఒక్క ప్రైవేట్ ఉద్యోగి కి ఉచిత రేషన్ తో పాటుగా 7,500 రూపాయల నగదు ఇవ్వాలి అని కోదండరాం రాష్ట్ర ప్రభుత్వం ను డిమాండ్ చేశారు.

అంతేకాకుండా ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ప్రతి నిరుద్యోగి కి 3,016 రూపాయలను నిరుద్యోగ భృతి కింద ఇవ్వాలి అని తెలిపారు. అంతేకాక రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థను పట్టించుకోకుండా గాలికి వదిలేసింది అంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఆన్లైన్ క్లాసుల ద్వారా అందరికీ సరైన విద్యా అందడం లేదు అని కోదండరాం అన్నారు. తెలంగాణ రాష్ట్రం లోని ప్రైవేట్ ఉపాద్యాయులు తీవ్ర ఆందోళన లో ఉన్నారు అని, ప్రభుత్వం వెంటనే స్పందించి విద్యా సంవత్సార క్యాలెండర్ ను ప్రకటించాలి అని, కళాశాల ల మాదిరిగా పాటశాల విద్యార్థులకు కూడా ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వాలి అని అన్నారు.