తిరుమలకు వెళ్ళేందుకు డిక్లరేషన్ ఎందుకు.. కొడాలి నాని సూటి ప్రశ్న..!

Monday, September 21st, 2020, 12:00:46 AM IST

తిరుమల శ్రీవారి దర్శనార్థం కొరకు వచ్చే అన్యమతస్థుల డిక్లరేషన్ అంశం ఏపీ రాజకీయ పార్టీల మధ్య వివాదం రేపుతున్న సంగతి తెలిసిందే. అయితే ఏ మతస్థులైనా ఎలాంటి డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి క్లారిటీ ఇచ్చారు. అయితే దీనిపై టీడీపీ నేతలు అభ్యంతరం తెలుపుతూ తిరుమలకు వచ్చే అన్యమతస్థులు డిక్లరేషన్ ఇవ్వాసిందేనని డిమాండ్ చేస్తున్నారు.

అయితే ఈ వివాదంపై స్పందించిన మంత్రి కొడాలి నాని టీడీపీ నేతలకు సూటి ప్రశ్న వేశారు. ఏ గుడికి, చర్చికి, మసీదుకు లేని డిక్లరేషన్ నిబంధన తిరుమలకు ఎందుకని అన్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు డిక్లరేషన్ గురుంచి మాట్లాడలేదని, సీఎం హోదాలో వెళ్ళే వారికి డిక్లరేషన్ అవసరం లేదని అన్నారు. ఎక్కడా లేని సంప్రదాయం తిరుమలలో ఎందుకు అని నిలదీశారు. జగన్ సంతకం పెట్టకుండా గుడికి వెళ్తే తిరుమల అపవిత్రం అవుతుందా అని అన్నారు. రాష్ట్రంలో దేవాలయాలపై జరుగుతున్న వరుస సంఘటనల విషయంలో టీడీపీ నేతలపై అనుమానాలున్నాయని అన్నారు.