అలా ఇవ్వకపోతే వచ్చే ఎన్నికలలో పోటీ చేయను – కొడాలి నాని

Sunday, November 8th, 2020, 08:06:03 PM IST

ఏపీ మంత్రి కొడాలి నాని నేడు గుడివాడలో పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ టీడీపీ నేతలపై మండిపడ్డారు. టీడీపీ నేతలను జగన్నాథ రథ చక్రాల కింద నల్లిని నలిపినట్లు నలిపేస్తామని హెచ్చరించారు. టీడీపీ నేతలు పొద్దున లేచినప్పటి నుంచే అబద్ధాలు చెబుతారని అన్నారు. ‘నా ఇల్లు-నా సొంతం’ అంటూ ఓడిపోయిన టీడీపీ నాయకులు రోడ్డెక్కి షో చేస్తున్నారని అన్నారు.

అయితే ప్రతి ఒక్కరికి ఇళ్ల్లు అందించాలన్నదే వైసీపీ కోరిక అని అన్నారు. చంద్రబాబుకు దమ్ముంటే గుడివాడలో ఒక్క ఇల్లైనా ఇచ్చి చూపించాలని అన్నారు. చంద్రబాబు కోర్టులకు వెళ్లి ఇళ్ల స్థలాల పంపిణీని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. గుడివాడలో 25 వేల మంది లబ్ధిదారులకు 2024 లోపు ఇళ్లు కట్టించి ఇస్తామని, ఒకవేళ అలా ఇవ్వలేకపోతే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని అన్నారు. టీడీపీ ఎన్ని కుట్రలు చేసిన 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చే తీరుతామని అన్నారు.