పిచ్చి వాగుడులు వాగితే అంతు చూస్తాం.. కొడాలి నాని సీరియస్ కామెంట్స్..!

Thursday, April 1st, 2021, 01:10:48 AM IST


టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడిపై ఏపీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు నారా లోకేశ్‌పై కూడా విరుచుకుపడ్డారు. తమ పార్టీ అధినేత, సీఎం జగన్‌పై సోషల్ మీడియాలో పిచ్చి వాగుడులు వాగితే అంతు చూస్తామని హెచ్చరించారు. జగన్ మోహన్ రెడ్డి దయతోనే చంద్రబాబు, లోకేశ్ హైదరాబాద్ తిరిగి వెళ్తున్నారని అన్నారు. 14 ఏళ్లు సీఎంగా చేసినా చంద్రబాబు నాయుడు తమను ఏమీ చేయలేరని కొడాలి స్పష్టం చేశారు.

అయితే చరిత్రలో నిలిచిపోయేలా సీఎం జగన్ ఒక్కొక్క నియోజకవర్గాన్ని వెయ్యి కోట్లకు పైగా నిధులతో అభివృద్ధి చేస్తుంటే ప్రతిపక్షాలకు కనబడకపోవడం దారుణమని అన్నారు. పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో చంద్రబాబు మాడు పగిలిందని, ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో ప్రజలు ఆయనకు కర్రు కాల్చి వాత పెట్టారని కొడాలి నాని అన్నారు. కంకిపాడు రహదారి నిర్మాణ పనులకు మంత్రి కొడాలి నాని, ఎంపీ వల్లభనేని బాలశౌరి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబుపై కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు.