అలా నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా – కొడాలి నాని

Thursday, December 17th, 2020, 10:30:24 PM IST

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్‌ను తిట్టడానికే చంద్రబాబు అమరావతిలో సభకు వెళ్ళారని అన్నారు. టీడీపీని జాతీయ పార్టీ అని చెప్పుకుంటున్న చంద్రబాబు ఏ విధంగా జాతీయ పార్టీనో నిరూపించాలని, ఒకవేళ టీడీపీ జాతీయ పార్టీగా నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని అన్నారు. ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచినట్లే చంద్రబాబు అమరావతి రైతులను కూడా వెన్నుపోటు పొడిచారని అన్నారు.

అయితే రాజధాని కోసం దుర్గమ్మను దర్శించుకొని పూజలు చేసిన చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ఒక్కసారైనా దుర్గ గుడికి వెళ్ళారా అని ప్రశ్నించారు. చంద్రబాబును కుప్పంలో ఓడించి రాజకీయంగా ఇంటికి పంపుతామని అన్నారు. అమరావతిపై రెఫరెండం పెడదామన్న చంద్రబాబు సవాల్ చేశారని, రెఫరెండంలో ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానన్న చంద్రబాబు ప్రస్తుతం పాలిటిక్స్ లో ఎక్కడున్నారని కొడాలి ప్రశ్నించారు. చంద్రబాబుకు దమ్ముంటే తాను రాజీనామా చేసి టీడీపీ ఎమ్మెల్యేలందరితో రాజీనామా చేయించాలని సవాల్ విసిరారు.