అమరావతిలో శాసన రాజధాని కూడా వద్దు.. మంత్రి కొడాలి నాని సంచలనం..!

Tuesday, September 8th, 2020, 09:07:21 AM IST

ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని గత 266 రోజులుగా రాజధాని గ్రామాల రైతులు నిరసనలు తెలుపుతున్నా ప్రభుత్వం మాత్రం మూడు రాజధానుల అంశంపై వెనక్కి తగ్గడంలేదు. అయితే అన్ని ప్రాంతాల అభివృద్ధే లక్ష్యమని అమరావతిని శాసన రాజధానిగా, విశాఖను పరిపాలన రాజధానిగా, కర్నూల్‌ని న్యాయ రాజధానిగా చేసేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను చేస్తుంది.

అయితే తాజాగా రాజధాని అంశంపై మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో శాసన రాజధాని కూడా వద్దని సీఎం జగన్‌కు తాను చెప్పానని, దీనిపై అన్ని పక్షాలతో మాట్లాడి నిర్ణయం తీసుకుందామని సీఎం జగన్ తనతో చెప్పారని అన్నారు. అమరావతిలో 55 వేల మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంటే దానిపై కోర్టుకు వెళ్లి స్టే తీసుకురావడం విడ్డూరంగా ఉందన్నారు. అటు తాను రాజకీయాల్లో ఉన్నంత కాలం జగన్ వెంటే నడుస్తానని కొడాలి నాని పేర్కొన్నారు.