నారా లోకేశ్ ట్రాక్టర్ నడపడంపై మంత్రి కొడాలి సెటైర్లు..!

Tuesday, October 27th, 2020, 03:23:56 PM IST

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు నిన్న తృటిలో ప్రమాదం తప్పిన సంగతి తెలిసిందే. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు పర్యటనలో భాగంగా వరద బాధిత ప్రాంతాల్లో నారా లోకేశ్ ట్రాక్టర్ నడుపుతుండగా అదు అదుపు తప్పి కాల్వలోకి దూసుకెళ్లింది. అయితే పక్కనే ఉన్న టీడీపీ ఎమ్మెల్యే మంతెన రామరాజు అప్రమత్తమై ట్రాక్టర్‌ను కంట్రోల్ చేయడంతో ప్రమాదం తప్పింది. అయితే ఈ ఘటనపై వైసీపీ నేతలు సోషల్ మీడియాలో తెగ సెటైర్లు వేస్తున్నారు.

అయితే తాజాగా నందిగామలో పర్యటించిన మంత్రి కొడాలి నాని పలు విషయాలపై మాట్లాడుతూ ట్రాక్టర్ ఘటనపై కూడా సెటైర్లు వేశారు. దొంగలు పడిన ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్టుగా నారా లోకేశ్ తీరు ఉందని వరదలు వచ్చింది ఎప్పుడు, పరిశీలిస్తుంది ఎప్పుడు అని ప్రశ్నించారు. నారా లోకేష్‌ది ఆఫ్ నాలెడ్జ్ అని అతగాడికి పార్టీ నడపడం రాదు, ట్రాక్టర్ నడపడం రాదని అన్నారు. కొల్లేటిలో ట్రాక్టర్ ఏ విధంగా దించాడో, లోకేష్ నాయకత్వంలో టీడీపీని కూడా అదే విధంగా దించుతాడని అన్నారు. అసలు లోకేష్ గురించి ఎక్కువగా మాట్లాడటం కూడా పరమ వేస్ట్ అంటూ ఎద్దేవా చేశారు.