చంద్రబాబు వెన్నుపోటు కి 25 ఏళ్లు…కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు!

Tuesday, August 25th, 2020, 03:04:02 PM IST

తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు పై మరొకసారి వైసీపీ నేత, మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఎల్జీమర్ తో బాధపడుతున్నారు అని అన్నారు. నష్టపరిహారం విషయం లో సీఎం జగన్ దేశానికే ఆదర్శం గా నిలిచారు అని అన్నారు. స్వర్ణ పాలెస్ అగ్ని ప్రమాదం ఘటన లో 50 లక్షల రూపాయలు, ఎల్జీ పాలిమర్స్ ఘటనలో కోటి రూపాయల చొప్పున నష్ట పరిహారం ఇచ్చారు అని తెలిపారు. అయితే చంద్రబాబు నాయుడు కమ్మ సంఘానికి అధ్యక్షుడు గా వ్యవహరిస్తున్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు కొడాలి నాని.

అయితే చంద్రబాబు కి విరాళాలు ఇచ్చే వారికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు అని, రమేష్ ఆసుపత్రి నిబంధనలకు ఉల్లంఘించింది అని, రమేష్ ను రక్షించేందుకు గల్లీ నుండి ఢిల్లీ వరకు ప్రయత్నాలు జరుగుతున్నాయి అని తెలిపారు. చంద్రబాబు నాయుడు తన ఇంట్లోనే రమేష్ ను పెట్టుకొని కాపలా కాస్తున్నారు అని ఆరోపించారు. చంద్రబాబు కాపలా కాసిన అరెస్ట్ చేస్తామని తెలిపారు. అయితే బాధితులను పరామర్శించేందుకు చంద్రబాబు రావడం లేదు అని, వస్తే కరోనా వస్తుంది అని అందుకే హైదరాబాద్ లో దాక్కున్నారు అని విమర్శించారు. కమ్మ సామాజిక వర్గం ను టార్గెట్ చేయాల్సిన అవసరం జగన్ కి లేదు అని, చంద్రబాబు నాయుడు వెన్నుపోటు కి 25 ఏళ్లు అని, త్వరలో టీడీపీ కి ఆ 23 సీట్లు కూడా రావు అని కొడాలి నాని అన్నారు.