గ్రామ సచివాలయ పరిధి లోనే భూమి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ – కొడాలి నాని

Friday, October 2nd, 2020, 03:04:38 PM IST

గ్రామ సచివాలయ వ్యవస్థ పై మంత్రి కొడాలి నాని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతి గ్రామం లో ప్రజల సమస్యలను ఎక్కడికక్కడ పరిష్కరించాలనే ఉద్దేశ్యం తోనే ఈ గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. స్థానికంగా ఉన్నత చదువులు చదివి, నిరుద్యోగులుగా ఉన్న యువతకు ఉపాధి కలగడం తో పాటుగా, రాష్ట్రంలో 5 కోట్ల ప్రజలకు ఈ వ్యవస్థ ఉపయోగపడుతుంది అని తెలిపారు. గాంధీ జయంతి రోజున ఈ వ్యవస్థను ఏర్పాటు చేశామని, రాబోయే రోజుల్లో అన్ని గ్రామాల్లో అన్ని కార్యక్రమాలను అమలు చేస్తామని మంత్రి వ్యాఖ్యానించారు.

త్వరలో గ్రామ సచివాలయా లోనే భూమి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఉంటుంది అని అన్నారు. అంతేకాక ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ గ్రామ సచివాలయ వ్యవస్థ మరియు వాలంటీర్ల పని తీరును ప్రశంసించాడం మాత్రమే కాకుండా, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఆ దిశగా ఆలోచన చేయాలని చెప్పడం మనకు గర్వకారణమని మంత్రి వ్యాఖ్యానించారు.