ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడు.. దేవినేని ఉమాకి కొడాలి స్ట్రాంగ్ కౌంటర్..!

Friday, September 4th, 2020, 02:40:01 PM IST

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమాకి వైసీపీ మంత్రి కొడాలి నాని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తాను బూతుల మంత్రినని అంటున్నారని, తాను నిజంగా బూతులు మాట్లడితే అసలు దేవినేని ఉమా, చంద్రబాబు బతికుంటారా అని ప్రశ్నించారు. దేవినేని ఉమా తండ్రి సోడాలు కొట్టేవారన్న విషయం గుర్తుపెట్టుకోవాలని తనపై ఆరోపణలు చేసే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడితే బాగుంటుందని అన్నారు.

అయితే రైతులను ఆనాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆసుకుంటే, ఈనాడు రైతులకు జగన్ ప్రభుత్వం అండగా నిలబడిందని అన్నారు. నిన్న అచ్చెన్నాయుడిని పరామర్శించేందుకు వచ్చిన చంద్రబాబు వైసీపీ టీడీపీ నేతలపై కక్ష్య సాధింపులకు పాల్పడుతుందని తప్పుడు ఆరోపణలు చేశారని అన్నారు. ఫైల్స్ ఆపరేషన్ చేయించుకుని అచ్చెన్నాయుడిలా 70 రోజుల పాటు ఆస్పత్రిలో పడుకున్న అడ్డగాడిద ఈ భూమి మీద ఎవరూ లేరని అన్నారు. చంద్రబాబే ఓ పెద్ద భిక్షగాడని, తనకు రాజకీయ భిక్ష పెట్టడమేంటని అన్నారు. జోలె పట్టుకుని అడుక్కుతినే బ్యాచ్‌ మీదని మండిపడ్డారు.