దమ్ముందా.. చంద్రబాబుకు మంత్రి కొడాలి నాని సవాల్..!

Saturday, August 1st, 2020, 08:07:22 PM IST

టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడికి మంత్రి కొడాలి నాని సవాల్ విసిరారు. మూడు రాజధానుల విషయంలో చంద్రబాబు ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబుకు దమ్ము, ధైర్యం ఉంటే 20 మంది ఎమ్మెల్యేల చేత రాజీనామాలు చేయించి ఉప ఎన్నికలకు వెళ్ళాలని సవాల్ విసిరారు.

అయితే ఉప ఎన్నికలలో టీడీపీ కనుక 20 సీట్లు గెలిస్తే రాజధాని వికేంద్రీకరణపై పునరాలోచన చేసే అవకాశం ఉంటుందేమోనని అన్నారు. ఉపఎన్నికలలో చంద్రబాబు ఓడిపోతే సీఎం జగన్ తీసుకున్న నిర్ణయానికి పూర్తి మద్ధతు తెలపాలని అన్నారు. ఈ సవాల్ స్వీకరించే దమ్ము చంద్రబాబుకు ఉందా అని ప్రశ్నించారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే సీఎం జగన్ మూడు రాజధానుల అంశాన్ని తీసుకొచ్చారని అన్నారు.