లోకేష్ లాంటి వేస్ట్ మనిషిని మేం ఎక్కడా చూడలేదు – కొడాలి నాని

Friday, October 30th, 2020, 03:38:22 PM IST

తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై వైసీపీ కీలక నేత, మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. లోకేష్ లాంటి వేస్ట్ మనిషిని మేం ఎక్కడా చూడలేదు అంటూ కొడాలి నాని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వరి చేనుకు, చేపల చెరువుకి తేడా తెలియని వ్యక్తి నారా లోకేష్ అంటూ కొడాలి నాని సెటైర్స్ వేశారు. అయితే వరద ప్రభావిత ప్రాంతాల్లో నారా లోకేష్ పర్యటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ మేరకు మంత్రి నారా లోకేష్ పై విమర్శలు గుప్పించారు. నారా లోకేష్ ఎక్కడ తిరిగినా ఉపయోగం లేదు అని, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే నారా లోకేష్ కి తగిన బుద్ది చెబుతాం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అయితే గతంలో టీడీపీ హయంలో జరిగిన కొన్ని సంఘటనలు గుర్తు చేశారు. కరెంట్ ఛార్జీలు తగ్గించమని అడిగితే బషీరాబాగ్ వద్ద రైతుల పై కాల్పులు జరిపించిన చరిత్ర చంద్రబాబు ది అంటూ ఆరోపించారు. అయితే ఇప్పుడు రైతులకి సంకెళ్లు వేశారని దేవినేని ఉమా నాటకాలు ఆడుతున్నారు, అప్పుడు బషీర బాగ్ ఘటనలో ఉమా గన్ తో ఎందుకు కాల్చుకొలేదు అని సూటిగా ప్రశ్నించారు. అయితే గుంటూరు లో రైతులు పోలీసుల పై తిరగబడితే సంకెళ్లు వేశాం అంటూ మంత్రి చెప్పుకొచ్చారు.