ఇళ్ల పథకంలో రివర్స్ టెండరింగ్ ద్వారా 200 కోట్ల రూపాయల ఆదా – కొడాలి నాని!

Thursday, August 6th, 2020, 02:50:48 AM IST


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పాలన లో వేగంగా దూసుకుపోతున్నారు. అయితే పేద ప్రజలకు మంచి జరిగేలా చూస్తున్న ప్రతి ఒక్క పనికి టీడీపీ అడ్డుపడుతోంది అని వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే కృష్ణా జిల్లాల్లో గుడి వాడ లో పేద ప్రజల కోసం కొత్తగా నిర్మిస్తున్న హౌజ్ ఫర్ ఆల్ కి సంబంధించిన ఒక పథకం ను కొడాలి నాని మరియు పేర్ని నాని లు ప్రారంభించారు. అయితే ఈ పనులను ప్రారభించిన అనంతరం కొడాలి నాని మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

అయితే గత తెలుగు దేశం పార్టీ ప్రభుత్వం పేదల ఇళ్ళ నిర్మాణం లో అవినీతికి పాల్పడింది అని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ప్రస్తుతం ఈ ఇళ్ళ పథకం లో రివర్స్ టెం దరింగ్ ద్వారా 200 కోట్ల రూపాయల ను ఆదా చేసినట్లు తెలిపారు. అయితే పేదలకు సకాలం లో అందాల్సిన ఇళ్ళ పట్టాల పంపిణీ కూడా తెలుగు దేశం పార్టీ కారణం గా ఆగిపోయింది అని అన్నారు. ప్రతి పక్ష పార్టీ లు న్యాయ స్థానాలకు వెళ్ళడం, ఇంకా ఆలస్యం అవడానికి కారణం అన్నారు. అయితే ఒకవేళ న్యాయస్థానం అనుమతి ఇస్తే ఆగస్ట్ 15 న పేదలకు ఇళ్ళ పట్టాలు ఇచ్చేందుకు సిద్దం అని అన్నారు.