వారికి నార్కో ఎనాలసిస్ పరీక్షలు చేయిస్తే నిజాలు బయట పడతాయి – కొడాలి నాని

Sunday, January 3rd, 2021, 08:00:56 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో రామతీర్థం లో రాముడి విగ్రహం ధ్వంసం ఘటన పై అధికార పార్టీ, ప్రతి పక్ష పార్టీ నేతలు ఒకరు పై మరొకరు ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర మంత్రి కొడాలి నాని తెలుగు దేశం పార్టీ నేతల పై సంచలన వ్యాఖ్యలు చేశారు. రామతీర్థం లో నూటికి నూరు శాతం విగ్రహాన్ని ధ్వంసం చేయించింది ప్రతి పక్ష నేత చంద్రబాబే అంటూ కొడాలి నాని ఆరోపించారు. అయితే చంద్రబాబు తో పాటుగా లోకేష్, అశోక్ గజపతి రాజు మరియు అక్కడి స్థానిక తెలుగు దేశం పార్టీ నాయకులకు నార్కొ ఎనాలిసిస్ పరీక్షలు చేయిస్తే నిజాలు బయట పడతాయి అంటూ కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు.

అయితే దేవుడి లాంటి ఎన్టీఆర్ కే వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకు, దేవుడు అన్నా, ప్రజాస్వామ్యం అన్నా నమ్మకం లేదు అని తెలిపారు. స్వార్థ రాజకీయల కోసమే చంద్రబాబు డేరా బాబా అవతారం ఎత్తారు అంటూ విమర్శలు గుప్పించారు. రాజకీయాల కోసం దేవుళ్ళను అడ్డం పెట్టుకొని బతికే నీచ స్థితికి చంద్రబాబు నాయుడు దిగజారి పోయారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే వార్డ్ మెంబర్ గా కూడా గెలవలేని లోకేష్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి సవాల్ విసరడం విడ్డూరం అంటూ ఎద్దేవా చేశారు. అయితే దొడ్డి దారిన మంత్రి పదవులు వెలగబెట్టి, జగన్ పెట్టిన అభ్యర్ధి చేతిలో ఓడిపోయిన వ్యక్తి నారా లోకేష్ అంటూ సెటైర్స్ వేశారు. అయితే ప్రజల తిరస్కరణకు గురి అయిన బఫూన్, జోకర్ లాంటి లోకేష్ ఛాలెంజ్ ను సీఎం జగన్ స్వీకరించాలి అని అనడం హాస్యాస్పదం అంటూ విమర్శించారు. కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి.