అసెంబ్లీ లోకి నిన్ను రానివ్వరు జనం…పవన్ పై కొడాలి నాని సీరియస్ కామెంట్స్

Tuesday, December 29th, 2020, 01:00:50 PM IST

జన సేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గుడివాడ పర్యటనలో వైసీపీ నేతల పై ఘాటు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇతర నేతలకు లాగా తనకు పేకాట క్లబ్బులు, సిమెంట్ ఫ్యాక్టరీ లు లేవు అని, సినిమాలే ఆధారం అంటూ చెప్పుకొచ్చారు. అయితే జగన్ పై, వైసీపీ నేతల పై చేసిన ఘాటు వ్యాఖ్యల పట్ల వైసీపీ నేతలు వరుస విమర్శలు చేస్తున్నారు. ఈ మేరకు గుడివాడ ఎమ్మెల్యే, మంత్రి కొడాలి నాని స్పందించారు. పవన్ కళ్యాణ్ తీరు పై, చేసిన వ్యాఖ్యల పై గట్టి సెటైర్స్ వేశారు.

ఒక మంత్రి గా రాష్ట్ర ప్రజలకి, గుడివాడ ఎమ్మెల్యే గా ఆ ప్రాంత ప్రజలకు తాను సమాధానం చెప్పాలి అని అన్నారు. ఎవరెవరో వచ్చి ఏవేవో అంటే వాటికి సమాధానం చెప్పాల్సిన అవసరం తనకు లేదు అని అన్నారు. పేకాట క్లబ్బులను ముయించిన వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి గారు అని, పేకాట ను విచ్చలవిడి గా ఆడించి జుదశాల చేసిన వ్యక్తి చంద్రబాబు, అతని పార్టనర్ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆరోజు మాట్లాడని పవన్ ఈరోజు మాట్లాడటం ఎందుకు, అన్ని పనికి రాని మాటలు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గుడివాడ ప్రజలను అడిగితే చెబుతారు, కొడాలి నాని పేకాట క్లబ్బులు ముయించాదా లేకపోతే పెట్టించాదా అంటూ వ్యాఖ్యానించారు. తను ఎవరి దగ్గర కూడా ప్యాకేజీలు తీసుకొని నోటికి వచ్చినట్లు మాట్లాడటం లేదు అంటూ పవన్ పై పరోక్ష వ్యాఖ్యలు చేశారు.

నోరు అదుపులో పెట్టుకోవాలి అంటూ మాకు చెప్పడం కాదు, నువ్వు పెట్టుకో అంటూ పవన్ కి సూచించారు.మాకు భయం లేదు అంటున్నారు, నిన్ను ఎవరూ భయపడమన్నాడు జగన్ మోహన్ రెడ్డి గారికి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే తనను సినిమాలు మానెయ్యమని చెప్పినవాడు ఎవడు అంటూ సెటైర్స్ వేశారు. రాష్ట్రంలో ఎవడన్నా సినిమాలు మనెయ్యమని ఎవడన్నా అడిగాడా అంటూ సూటిగా ప్రశ్నించారు.సీఎం జగన్ మంచిగా పాలిస్తే రాజకీయాలు వదిలేసి సినిమాకు చేసుకుంటా అని నువ్వే చెప్పావు అంటూ నిలదీశారు. ఇప్పటికీ పవన్ ను యాక్టర్ గానే గుర్తిస్తున్నాం అని సంచలన వ్యాఖ్యలు చేశారు.అయితే పవన్ కళ్యాణ్ ను రెండు చోట్ల ప్రజలు ఓడగొట్టారు అని, అసెంబ్లీ లో కి జనం నిన్ను రానివ్వరు అంటూ కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. కొడాలి నాని పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ల పై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతుండగా, రాష్ట్రంలో ఇది హాట్ టాపిక్ గా మారింది.