చంద్రబాబు, పవన్ పేరు నొక్కినా అదే వస్తుంది

Friday, January 1st, 2021, 09:24:59 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. పవన్ కళ్యాణ్ పర్యటనతో అటు అధికార పార్టీ వైసీపీ కి గట్టి కౌంటర్ ఇచ్చినట్లు అయింది. అప్పటి నుండి పలువురు నేతల పై సోషల్ మీడియా లో దారుణంగా ట్రోలింగ్ జరుగుతుంది. అయితే కొడాలి నాని మరొకసారి ప్రతి పక్ష పార్టీ నేతల పై దారుణ వ్యాఖ్యలు చేశారు. చూసే వాళ్ళు ఏది కావాలి అంటే అదే గూగుల్ లో వస్తుంది అని కొడాలి నాని అన్నారు. పదవి విరమణ చేసిన న్యాయమూర్తి గూగుల్ సెర్చ్ చేస్తే ఏదో వచ్చింది అని ఆర్డర్ లో పెట్టారు అంటూ చెప్పుకొచ్చారు. అయితే గూగుల్ లో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పేర్లు నొక్కినా అదే వస్తుంది అంటూ వ్యాఖ్యానించారు.

అయితే తాము వెదికితే మాత్రం సీఎం జగన్ ఎవరి ముందు తల వంచరు అంటూ తెలిపారు. అయితే దేశ చరిత్రలో నలభై సంవత్సారాల చరిత్ర గల పార్టీలతో ఢీ కొట్టినట్లు మాకు కనిపిస్తుంది అని అన్నారు. అయితే సీఎం జగన్ పై వరుస ప్రశంసల వర్షం కురిపించారు కొడాలి నాని. సీఎం వైఎస్ జగన్ మీ కోసమే ఉన్నారు, ఇచ్చిన ప్రతి వాగ్దానం అమలు చేస్తారు అంటూ తెలిపారు.