లోకేష్ సర్పంచ్ గా గెలిస్తే నేను రాష్ట్రం వదిలి వెళ్ళిపోతా – కొడాలి నాని

Friday, February 12th, 2021, 12:15:09 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో జరుగతున్న గ్రామ పంచాయితీ ఎన్నికల్లో వైసీపీ బలపరిచిన అభ్యర్ధులు ఎక్కువ శాతం విజయం సాధిస్తున్నారు. అయితే ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం లో జరుగుతున్న పలు పరిణామాల పై, ప్రతి పక్ష పార్టీ నేతలు వ్యవహరిస్తున్న తీరు పై వైసీపీ కీలక నేత, మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కి సవాల్ విసిరారు. నారా లోకేష్ చిత్తూరు కి వెళ్లి సర్పంచ్ గా పోటీ చేసి గెలిచి చూపించాలి అంటూ సవాల్ విసిరారు. అయితే లోకేశ్ సర్పంచ్ గా గెలిస్తే నేను రాష్ట్రం వదిలి వెళ్ళిపోతా అంటూ కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు.

అయితే ఈ మేరకు ప్రధాన ప్రతి పక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై, జన సేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు కొడాలి నాని. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయం లో అధికార పార్టీ పై ప్రతి పక్ష పార్టీ నేతలు వరుస విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ నాతో కలిసి వస్తా అంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కి వ్యతిరేకంగా పోరాటం చేస్తా అంటూ కొడాలి నాని చెప్పుకొచ్చారు. కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి.