దొంగలను తీసుకొచ్చి చంద్రబాబు రాజ్యాంగ పదవిలో కూర్చోబెట్టారు – కొడాలి నాని

Thursday, November 19th, 2020, 11:26:42 PM IST

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ లపై మంత్రి కొడాలి నాని మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రాజ్యాంగ వ్యవస్థలో ఉన్నారో, చంద్రబాబు చేతిలో ఉన్నారో అందరికీ తెలుసని అన్నారు. దొంగలను తీసుకొచ్చి చంద్రబాబు రాజ్యాంగ పదవిలో కూర్చోబెట్టారని అన్నారు. కుక్కను తీసుకువచ్చి సింహాసనం మీద కూర్చోబెడితే సింహాసనం పరువు పోతుందే తప్పా వెలిగిపోదని నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కూడా కుక్కలాంటి వాడేనని కొడాలి సంబోధించారు. నిమ్మగడ్డ రమేష్‌ను రమేష్‌ను తొలగిస్తేనే రాజ్యాంగ పదవిపై మళ్ళీ గౌరవం పెరుగుతుందని అన్నారు.

ఇదిలా ఉంటే మంత్రి కొడాలి నాని చేస్తున్న వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకున్న నిమ్మగడ్డ ఆయనపై ఈ రోజు గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయంపై ప్రభుత్వం, అధికార యంత్రాంగంతో తాను సంప్రదింపులు జరుపుతుంటే తనపై మంత్రి కొడాలి నాని ఉద్దేశ పూర్వకంగా విమర్శలు చేస్తున్నారని నిమ్మగడ్డ గవర్నర్‌కు లేఖ రాశారు. ఉద్యోగులను ఎన్నికల కమీషన్‌కు వ్యతిరేకంగా రెచ్చగొట్టే విధంగా కొడాలి నాని వ్యాఖ్యలు ఉన్నాయని తక్షణమే అతడిపై చర్యలు తీసుకోవాలని నిమ్మగడ్డ గవర్నర్‌ను కోరిన సంగతి తెలిసిందే.