చంద్రబాబును కుప్పం ప్రజలు తరిమి తరిమికొట్టారు – కొడాలి నాని

Saturday, February 20th, 2021, 03:00:49 AM IST


టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై మంత్రి కొడాలి నాని మరోసారి విరుచుకుపడ్డారు. టీడీపీ అధినేత చంద్రబాబును కుప్పం ప్రజలు తరిమి తరిమి కొట్టారని వచ్చే ఎన్నికల్లో ఆయన కుప్పంలో ఓడిపోవడం ఖాయమని అన్నారు. కుప్పంను చంద్రబాబు 35 ఏళ్లు గాలికొదిలేశాడని, కరోనా కష్ట కాలంలో కూడా కుప్పం ప్రజలను పట్టించుకోలేదని బాబు గుంటనక్క బుద్ధిని కుప్పం ప్రజలు గ్రహించారని అన్నారు.

అయితే చంద్రబాబు ఇప్పుడు చిత్తు కాగితంలా మిగిలిపోయారని, పంచాయితీ ఎన్నికల కోసం ఆయన 400 కోట్లకు పైగా ఫండ్స్ వసూల్ చేశారని అన్నారు. ఇకపోతే సోము వీర్రాజు మాటలను సొంత పార్టీ నేతలే వినరని ఇక ప్రజలేం వింటారని అన్నారు. ఏపీ బీజేపీ నేతలకు నిజంగా శక్తి ఉంటే స్టీల్ ప్లాంట్‌పై కేంద్రం నుంచి ప్రకటన చేయించాలని అప్పుడే ప్రజలు నమ్ముతారని అన్నారు.