70 ఏళ్లు వచ్చినా అబద్ధాలు మానుకోవడం లేదు.. చంద్రబాబుపై కొడాలి కామెంట్స్..!

Thursday, November 12th, 2020, 01:09:14 AM IST

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై మంత్రి కొడాలి నాని సీరియస్ అయ్యారు. పేదల కోసం ఇళ్ల స్థలాలను పంపిణీ చేస్తుంటే అడ్డుకోవడం తగదని అన్నారు. 25 కోట్లు ఖర్చు పెట్టి 30 లక్షల మంది ఇళ్ల స్థలాలను చంద్రబాబు కోర్టుల ద్వారా అడ్డుకుంటున్నారని ఇప్పటికైనా ఆ కేసులను ఉపసంహరణ చేసుకోవాలని సూచించారు. కోర్టుల్లో వేసిన స్టేను చంద్రబాబు వాపస్ తీసుకుంటే డిసెంబర్ 21 సీఎం జగన్ పుట్టిన రోజున టిడ్కో ఇళ్లు, ఇళ్ల స్థలాల పట్టాలను పంపిణీ చేస్తామని అన్నారు.

అయితే ఇళ్ల పట్టాల కేసుల విషయంలో చంద్రబాబు తన నిర్ణయం మార్చుకోకపోతే టిడ్కో ఇళ్ల ముందే తాను ఆందోళనకు దిగుతానని హెచ్చరించారు. టిడ్కోలో 13 లక్షల ఇల్లు కట్టించామని చంద్రబాబు అండ్ బ్యాచ్ మాట్లాడుతున్నారని అవన్ని ఎక్కడెక్కడ కట్టారో కూడా చూపించాలని డిమాండ్ చేశారు. 70 ఏళ్లు వచ్చినా చంద్రబాబు అబద్ధాలు చెప్పే అలవాటును మానుకోలేదని మండిపడ్డారు. నంద్యాల షేక్‌ అబ్దుల్ సలాం ఆత్మహత్య ఘటనను టీడీపీ నేతలు రాజకీయం చేస్తూ ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని ఆరోపించారు.