40 ఏళ్ల అనుభవం ఉన్న అతి భయంకర రాక్షసుడు చంద్రబాబు

Saturday, August 15th, 2020, 10:37:40 PM IST

సీఎం జగన్ మోహన్ రెడ్డి పాలన విధానం పై మంత్రి కొడాలి నాని ప్రశంసల వర్షం కురిపించారు. అదే విధంగా ప్రతి పక్ష నేత గా చంద్రబాబు నాయుడు ప్రవర్తిస్తున్న తీరు పై ఘాటు విమర్శలు చేశారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను వంద శాతం నెరవేర్చాలని తపన పడుతున్నారు అంటూ మంత్రి కొడాలి నాని అన్నారు. లోక కల్యాణం కోసం ఋషులు యజ్ఞాలు చేస్తుంటే, రాక్షసుడు మాదిరి చంద్రబాబు నాయుడు చెడగొడు తున్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో 40 ఏళ్ల అనుభవం ఉన్న అతి భయంకరమైన రాక్షసుడు చంద్రబాబు అంటూ ఘాటు విమర్శలు చేశారు. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి భావిస్తున్నారు అని, అలా చేస్తే సీఎం జగన్ ప్రజల గుండెల్లో దేవుడు అవుతాడు అనే భయం చంద్రబాబు కి పట్టుకుంది అని అన్నారు. చంద్రబాబు వి దుర్మార్గపు ఆలోచనలు అని, మహిళలను మోసం చేశారు అంటూ వ్యాఖ్యానించారు. మహిళలకు ఇళ్ళ స్థలాలు, హక్కులు కల్పిస్తుంటే సైంధవుడు లా అడ్డు పడుతున్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.