నారా లోకేష్, చంద్రబాబు ల పై సంచలన వ్యాఖ్యలు చేసిన కొడాలి నాని

Tuesday, December 15th, 2020, 04:13:55 PM IST

తెలుగు దేశం పార్టీ కీలక నేతల పై మంత్రి కొడాలి నాని మరొకసారి ఘాటు విమర్శలు చేశారు. సీఎం జగన్ అన్ని వర్గాల వారి కోసం సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టారు అని కొనియాడారు. సంక్షేమం లక్ష్యం గా సుపరిపాలన అందిస్తున్నారు అని అన్నారు. వర్షాలకు దెబ్బతిన్న పంటలకు నేడు ఇన్ పుట్ సబ్సిడీ అందించారు అని తెలిపారు. ఏ ప్రభుత్వం కూడా దేశం లో ఇంత త్వరగా పరిహారం ఇవ్వలేదు అని పేర్కొన్నారు.

అయితే సీఎం జగన్ పై ప్రశంసల వర్షం కురిపించిన అనంతరం టీడీపీ నేతల పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు, ఆయన తోక పార్టీలకు రాష్ట్రం సర్వ నాశనం అయినా పర్వాలేదు అని, 29 గ్రామాలతో కూడిన అమరావతి ఉంటే చాలు అని, మిగిలిన వారిని పట్టించుకోకుండా, తమ వర్గానికి మేలు జరిగితే చాలు అని నీచ రాజకీయాలు చేస్తున్నారు అంటూ మండిపడ్డారు. అయితే డిసెంబర్ 25 న ఇళ్ళ స్థలాల పంపిణీ గురించి మాట్లాడారు. మార్చ్ లోనే జరగాల్సింది అని, కానీ 25 కోట్లు ఖర్చు పెట్టి కోర్టుల ద్వారా స్టే తెచ్చిన దుర్మార్గుడు చంద్రబాబు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ట్విట్టర్ లో లోకేష్ రైతుల పై కపట ప్రేమ చూపిస్తున్నారు అని ఘాటు విమర్శలు చేశారు.