వాళ్ళ కాళ్ళు పట్టుకొని సీఎం అయిన చరిత్ర చంద్రబాబుది – కొడాలి నాని

Friday, April 9th, 2021, 03:59:21 PM IST

తెలుగు దేశం పార్టీ అధినేత, మాజి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై మంత్రి కొడాలి నాని మరొకసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు జీవితం అంతా మేనేజ్ చేయడమే అంటూ విమర్శించారు. ఎన్టీఆర్, మోడీ, పవన్ కాళ్ళు పట్టుకొని సీఎం అయిన చరిత్ర చంద్రబాబు ది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ప్రజా బలంతో సీఎం అయిన వ్యక్తి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ది అంటూ చెప్పుకొచ్చారు. ఓటమి భయంతో ఎన్నికల నుండి పారిపోయిన చరిత్ర చంద్రబాబుది అని, ప్యాకేజి కోసం ప్రత్యేక హోదా ను తాకట్టు పెట్టింది చంద్రబాబు అంటూ ఘాటు విమర్శలు చేశారు.

అయితే అల్జీమర్స్ వచ్చింది ప్రజలకు కాదు అని, చంద్రబాబు కి అంటూ సెటైర్స్ వేశారు. ఎన్నికలు నుండి పారిపోయి వచ్చిన చంద్రబాబు ఏ ఎన్నికలు వచ్చినా గెలుపు ఖాయం అని అన్నారు. పూర్తి అయ్యాక మళ్ళీ పది రోజులు కనపడడు అని వ్యాఖ్యానించారు. అయితే హోదా అడిగితే జగన్ కేసులు పెడతారు అని భయపడే వ్యక్తి కాదు అంటూ చెప్పుకొచ్చారు. అయితే జగన్ రక్తం లో మీకు చేతనైతే ఒక చుక్క భయం అనే బిందువు ను చూపించండి అంటూ సవాల్ విసిరారు. అయితే అటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పై విమర్శలు గుప్పిస్తూనే, జగన్ పై ప్రశంసల వర్షం కురిపించారు.