పారిపోయేవాళ్ళు ఎవరో ప్రజలకు తెలుసు…చంద్రబాబు పై కొడాలి నాని ఫైర్

Thursday, December 3rd, 2020, 12:52:19 PM IST

తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు, ప్రతి పక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు ఫేక్ ప్రతి పక్ష నేత అని, తెలుగు దేశం పార్టీ ఫేక్ పార్టీ అని కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. పొత్తు లేకుండా పోటీ చేయలేని వ్యక్తికి తమ నాయకుడు సీఎం జగన్ మోహన్ రెడ్డి గారిని విమర్శించే అర్హత లేదు అంటూ వ్యాఖ్యానించారు. సీఎం జగన్ పై చంద్రబాబు నాయుడు చేసిన విమర్శలను తిప్పి కొడుతూ మంత్రి కొడాలి నాని ద్వజమెత్తారు. అంతేకాక పారిపోయే వాళ్ళు ఎవరో ప్రజలందరికీ తెలుసు అని విమర్శించారు.

అయితే చంద్రగిరి వదిలి కుప్పం పారిపోయింది చంద్రబాబు కాదా అంటూ కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓటుకి కోట్లు కేసులో చంద్రబాబు నాయుడు హైదరాబాద్ నుండి పారిపోయారు అంటూ విమర్శలు చేశారు. ఆయనో ఫేక్ ప్రతి పక్ష నేత అని అన్నారు. చంద్రబాబు నాయుడు అధికారం లో ఉండగా పెన్షన్ ఒక్కరికీ కూడా పెంచలేదు అని ఆరోపించారు. తెలుగు దేశం పార్టీ హయాంలో ఎవరైనా చనిపోతెనే పెన్షన్ పెంచేవాళ్ళు అంటూ మంత్రి చెప్పుకొచ్చారు. కానీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వచ్చాక అర్హులు అయిన అందరికీ ఫించ న్లు అందిస్తున్నాం అని అన్నారు. ఒకటవ తేదీన అందిస్తున్నాం అంటూ మంత్రి చెప్పుకొచ్చారు.